రెప్పపాటులో ఊహించని ప్రమాదం.. గోడ కూలి రైతు మృతి (వీడియో)

27307చూసినవారు
పంజాబ్ రాష్ట్రం మాన్సాలో రెప్పపాటులో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రైతు సైకిల్‌పై వెళ్తున్నాడు. స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని.. రోడ్డు పక్క నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న గోడ అతడిపై కూలిపోయింది. ఇటుకలు మొత్తం ఒక్కసారిగా మీద పడటంతో ఆ రైతు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.