
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
కర్నూలు జిల్లా బేతంచెర్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ఢీకొని వేణు రెడ్డి (19) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




