
EPFO నిబంధనలు సరళతరం.. ఉద్యోగులకు ఊరట
ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) నిబంధనలు సరళతరం అయ్యాయని, కంపెనీలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ ప్రక్రియ సులభతరం అవుతుందని రిటైర్డ్ పీఎఫ్ కమిషనర్ గుణేశ్వరరావు తెలిపారు. ఈపీఎఫ్‌వోలో మార్పులు, కనీస పెన్షన్ రూ.1000పై చర్చ జరిగిందని, ఈ సమస్యల పరిష్కారాలపై ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఈపీఎఫ్ పథకం ప్రారంభమై 30 ఏళ్లు పూర్తయినా పెన్షన్ పెంపులో ఇబ్బందులున్నాయని ఆయన పేర్కొన్నారు.




