AP: తిరుమలకు రిలయన్స్ అధినేత ముఖేష్
అంబానీ తనయుడు అనంత్
అంబానీ 25 ఈవీ బస్సులను విరాళంగా ప్రకటించారు. ఇందులో 15 బస్సులు ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నాయి. ఈ ఏడాది జూన్లో శ్రీవారిని దర్శించుకున్న అనంత్
అంబానీ టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులు, వాటికి అవసరమైన 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ సంస్థ విరాళంగా అందిస్తుందని ప్రకటించారు.