TG: గుండెపోటుతో కన్నుమూసిన ప్రకృతి కవి అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. ఘట్కేసర్‌లోని NFC నగర్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ పాడే మోసారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు అందెశ్రీ అభిమానులు భారీగా తరలివచ్చి ఆయన పార్టీవదేహానికి నివాళులర్పించారు.