
టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై అమెరికా దర్యాప్తు
అమెరికా రవాణా భద్రతా సంస్థ టెస్లా సంస్థపై మరోసారి దృష్టి సారించింది. టెస్లా కార్లలోని సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ పనితీరుపై పెరుగుతున్న ఆందోళనలు, పలు సంఘటనలపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ దాటడం, తప్పు దారిలో వెళ్లడం, ఇతర వాహనాలకు ఢీకొనడం వంటి ఘటనలతో పాటు 12 ప్రమాదాల్లో 20 మంది గాయపడ్డారని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న 29 లక్షల టెస్లా వాహనాలపై ఈ దర్యాప్తు కొనసాగనుంది.




