రామ్, భాగ్యశ్రీ బోర్సే నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా నుంచి మరో పాట ఈ నెల 31న విడుదల కానుంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామ్ కెరీర్ లో 22వది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందన లభించింది. నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాలని రామ్ ఎదురు చూస్తున్నారు.