అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు: ఎమ్మెల్యే కాలేరు

0చూసినవారు
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు: ఎమ్మెల్యే కాలేరు
TG: అంబర్‌పేట నియోజకవర్గంలోని అద్దె భవనాల్లో కొనసాగుతోన్న అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ తెలిపారు. గురువారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లను అందజేశారు. నియోజకవర్గంలోని 34 అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఖాళీగా ఉన్న 9 మంది టీచర్లను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు .

ట్యాగ్స్ :