బీఆర్ఎస్ మీద కోపంతో రైతులపై కక్ష సాధింపు: హరీశ్ రావు

4863చూసినవారు
TG: కేసీఆర్, బీఆర్ఎస్ మీద కోపంతో రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 'కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో గోదావరి ప్రవహిస్తుంది. మోటార్లు ఆన్ చేస్తే చాలు, రైతులకు నీళ్లు ఇవ్వొచ్చు. కానీ నీళ్లు ఎత్తి పోయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్' అంటూ మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్