TG: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో మేనమామలపై కోపంతో ఓ యువకుడు వారి ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. తనకు ఇష్టమైన మరదలిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారన్న కోపంతో వెల్డింగ్ కార్మికుడు మహ్మాద్ మగ్ధూం ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్నేహితుడు సబ్బని లక్ష్మీనారాయణతో కలిసి సెప్టెంబరు 28న తాళాలు పగులగొట్టి రెండు ఇళ్లలో రూ.60 వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. నగదులో కొంత పంచుకుని హైదరాబాద్లో ఖర్చు చేశారు. మిగతా ఆభరణాలను తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 6 తులాల బంగారం, 45 తులాల వెండి, రూ.13,300 నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.