రెచ్చిపోయిన యువకులు.. హాస్టల్‌పై దాడి (వీడియో)

29927చూసినవారు
AP: హాస్టల్‌లో యువకులు రెచ్చిపోయారు. గంజాయి మత్తులో కొందరు యువకులు హాస్టల్‌లోకి ప్రవేశించి దాడికి దిగారు. కట్టెలు, కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్, పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. గంజాయి మత్తులో హాస్టల్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్