AP: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఈ పదవిలో ఉన్న శ్యామలరావును బదిలీ చేస్తూ.. ఆయన స్థానంలో అనిల్ సింఘాల్‌ను రెండోసారి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ప్రమాణం చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు ఈవో అనిల్ కుమార్‌కు ఆశీర్వచనం అందించారు.