భగవంత్‌ కేసరి’ రీమేక్‌గా ‘జన నాయగన్‌’ స్పందించిన అనిల్‌

33చూసినవారు
దర్శకుడు అనిల్‌ రావిపూడి, 'జన నాయగన్‌' ట్రైలర్‌లోని నాలుగు సన్నివేశాలను చూసి 'భగవంత్‌ కేసరి'ని యథాతథంగా తీసేశారని అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. 'మన శంకరవరప్రసాద్‌గారు' చిత్ర ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ, 'భగవంత్‌ కేసరి' రీమేక్‌పై ప్రశ్నించగా, సినిమా విడుదలయ్యే వరకు సోషల్‌మీడియాలో చర్చ అనవసరమని అన్నారు. 'భగవంత్‌ కేసరి' మూవీ ఆత్మను తీసుకుని, అక్కడి నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసుకుని ఉంటారని, ఓపెనింగ్ సీన్స్, ఇంటర్వెల్ వంటి కొన్ని భాగాలు యథాతథంగా తీసి ఉండవచ్చని, మిగిలినదంతా మార్చి ఉంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్