వచ్చే ఏడాది జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతులో తొలిసారిగా యానిమల్ కంటింజెంట్ పాల్గొననుంది. రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులను ఈ కవాతులో ప్రదర్శించనున్నారు. ఈ బృందంలో సరిహద్దుల వద్ద భద్రత కోసం ఉపయోగించే బాక్ట్రియన్ ఒంటెలు, గుర్రాలు, డేగలు, ఆర్మీ జాగిలాలు ఉన్నాయి.