చక్కెర ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీలర్ల వద్ద చక్కెర నిల్వ పరిమితిని 2000 క్వింటాళ్ల నుంచి 1000 క్వింటాళ్లకు తగ్గించింది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. డీలర్లు 15 రోజులకు మించి నిల్వలు ఉంచుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ చర్యల ద్వారా ధరలు నియంత్రణలోకి రావడమే కాకుండా, కృత్రిమ కొరతను నివారించవచ్చని కేంద్రం భావిస్తోంది.