ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. శుక్రవారం ఉదయం నక్సలైట్లు ఉన్నారనే సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మరణించిన నక్సలైట్ల సంఖ్య 243కు చేరుకుంది.