ఏషియన్ గేమ్స్‌లో భారత యువ ఆర్చర్ కుంకుమ్ (17) అద్భుత ప్రదర్శన చేశారు. రికర్వ్ ఆర్చరీ ఉమెన్స్ సింగిల్స్‌లో ఆమె స్వర్ణ పతకాన్ని సాధించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కొరియా ఆర్చర్‌పై 6-5 పాయింట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించారు. శుక్రవారం కూడా రికర్వ్ ఉమెన్స్ టీమ్‌లో స్వర్ణం, మిక్స్డ్ టీమ్‌లో రజతం గెలుచుకున్న జట్టులోనూ కుంకుమ్ సభ్యురాలిగా ఉన్నారు.