అమెరికాలో ఘోరం.. గుజరాతీ మహిళను కాల్చి చంపిన దుండగుడు

42చూసినవారు
అమెరికాలోని వర్జీనియాలో భారత సంతతికి చెందిన గుజరాతీ మహిళ మేఘనాబెన్ పటేల్ దారుణ హత్యకు గురయ్యారు. ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న ఆమెపై దుండగుడు కాల్పులు జరిపి హతమార్చాడు. దోపిడీ యత్నంలో ఈ ఘాతుకం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ప్రకారం, ముసుగు ధరించిన వ్యక్తి స్టోర్‌లోకి ప్రవేశించి, మేఘనాబెన్‌పై కాల్పులు జరిపి, అనంతరం పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్