TG: చైనా మాంజా చుట్టుకుని మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేటకు బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా చుట్టుకోవడంతో చైతన్య చేయి తెగింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు మాదాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయివర్ధన్ రెడ్డి మెడకు మాంజా తగిలి లోతైన గాయమైన విషయం తెలిసిందే. చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ రాష్ట్రంలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.