TG: హైదరాబాద్ క్యూర్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్న సంగతి తెలిసిందే. వీటి సంఖ్యకు తగినంత మంది స్థానికులు లాటరీలో ఎంపిక కాని ప్రాంతాల్లో మరోసారి లాటరీ తీసే ఆలోచనలో అధికారులున్నారు. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో లాటరీలో ఎంపికైన 600 (480 సెలెక్ట్ + 120 వెయిటింగ్ లిస్టు) మందిపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయింది. అధికారుల పరిశీలనలో సొంత నియోజకవర్గానికి చెందిన వారిగా తేలిన దరఖాస్తులను మాత్రమే లాటరీ తీయాలని భావిస్తున్నారు.