తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గేలా కనిపించడం లేదు. వాయుగుండం నిన్న తీరం దాటడంతో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే మరో అల్పపీడనం రానున్నట్లు IMD తెలిపింది. ఈనెల 30న అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1 నాటికి అది అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.