టర్కీలో గురువారం మరోసారి భారీ
భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైనట్లు ప్రాథమిక సమాచారం. దియార్‌బకిర్, అదియమాన్, షాన్లియుర్ఫా సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
భూకంపం సంభవించిన వెంటనే దాని తీవ్రతను 5.5గా అధికారులు అంచనా వేశారు. అనంతరం సవరించిన అంచనాల ప్రకారం తీవ్రత 5.8గా వెల్లడైంది.
భూకంపం ప్రభావంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ AFAD పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.