TG: సంగారెడ్డి పట్టణంలో అర్ధరాత్రి జరిగిన గొడవలో ఫాసిల్ (45) అనే వ్యక్తి కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. బిలాల్ (38) అనే మరో వ్యక్తి తొడ భాగంలో గాయపడ్డాడు. నాల్సాబ్గడ్డకు చెందిన ఫాసిల్, బిలాల్, రహీం (35) సోమవారం రాత్రి
సితార థియేటర్ ఎదురుగా ఉన్న జలాల్బాగ్ గ్రౌండ్లో మద్యం సేవిస్తుండగా గొడవ జరిగింది. ఈ క్రమంలో రహీం కత్తితో ఫాసిల్పై దాడి చేయగా, అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం బిలాల్పై కూడా దాడి చేశాడు. నిందితుడు రహీం పరారయ్యాడు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.