తెలంగాణలో మరో కొత్త జిల్లా!

29చూసినవారు
తెలంగాణలో మరో కొత్త జిల్లా!
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రాజధాని హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో జిల్లాల పునర్విభజన జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్లు నాలుగుగా మారిన నేపథ్యంలో, జిల్లాల హద్దులను కమిషనరేట్ల పరిధితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2027 జనగణనకు ముందే, అంటే వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్