అమెరికా మరో కొత్త రూల్‌.. ఇకపై ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఫొటోలు

117చూసినవారు
అమెరికా మరో కొత్త రూల్‌.. ఇకపై ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఫొటోలు
వలసదారుల నియంత్రణలో భాగంగా అమెరికా ప్రభుత్వం మరో కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఇకపై అమెరికాయేతర పౌరులు దేశంలోకి ప్రవేశించే టైంలో లేదా బయలుదేరే సమయంలో వారి ఫొటోలను తప్పనిసరిగా తీయనున్నారు. ఈ నియమం గ్రీన్‌కార్డు హోల్డర్లతో పాటు అందరికీ వర్తిస్తుంది. వలసదారుల కదలికలను పర్యవేక్షించడమే దీని ఉద్దేశం. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం డిసెంబరు 26 నుంచి అమల్లోకి రానుంది.

సంబంధిత పోస్ట్