ఏపీలో మరో ప్రేవైట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఏలూరు (D) లింగపాలెం(M) జూబ్లీనగర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను లింగపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు.