మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

1చూసినవారు
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం
AP: పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డిగూడెం వద్ద సోమవారం మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తోంది. రెడ్డిగూడెం వద్దకు బస్సు రాగానే రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటు చేసిన పైపులకు తగిలి, అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగింది. ప్రయాణికులు అత్యవసర ద్వారం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్