మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా "సీఓఏఎస్ కమెండేషన్" అవార్డును అందుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న ఆయన, ఆర్మీ సామర్థ్యాన్ని పెంచడంపై చర్చించినట్లు తెలిపారు. దేశభక్తి విలువలను సినిమాల ద్వారా ప్రోత్సహించినందుకు ఈ గుర్తింపు దక్కింది.