డిసెంబర్‌లో మరో రిలీఫ్‌.. తగ్గనున్న EMIల భారం?

19187చూసినవారు
డిసెంబర్‌లో మరో రిలీఫ్‌.. తగ్గనున్న EMIల భారం?
రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెపో రేటును తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అక్టోబర్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలోనే భవిష్యత్‌ రేట్ల కోతపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. స్థూల ఆర్థిక గణాంకాలు కూడా అందుకు అనుకూలంగా ఉండటంతో రేట్ల కోత ఉండొచ్చని మల్హోత్రా అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో రేట్ల నిర్ణాయక కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్