ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన రూ.1,120 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. యస్ బ్యాంక్ మోసం కేసులో భాగంగా 18 ఆస్తులు, ఎఫ్‌డీలు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్‌హోల్డింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అటాచ్ చేసిన వాటితో కలిపి మొత్తం విలువ రూ.10 వేల కోట్లకు చేరింది. ఈ కేసుపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.