భారత్‌లో మరో ఎబోలా అనుమానిత కేసు కలకలం

ఆఫ్రికా దేశాల్లో వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ నేపథ్యంలో భారత్‌లో అప్రమత్తత పెరిగింది. బెంగళూరులో ఉగాండా నుంచి వచ్చిన మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించగా, పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. ఇదే సమయంలో గుజరాత్‌లో కాంగో నుంచి వచ్చిన ఓ వ్యాపారవేత్తతో పాటు మరో ముగ్గురిలో అనుమానిత లక్షణాలు బయటపడటంతో వారిని అహ్మదాబాద్‌లో ఐసోలేషన్‌లో ఉంచారు. నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా ఎబోలా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.