TG: హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్ర కుట్ర బయటపడింది. గుజరాత్ ATS ముగ్గురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తన ఇంటినే ప్రయోగశాలగా మార్చి సైనైడ్ కంటే ప్రమాదకరమైన రైసిన్ రసాయనాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. UPకి చెందిన సులేమాన్, సలీంఖాన్‌లతో కలిసి రైసిన్ ద్వారా భారీ విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు ATS తెలిపింది. హైదరాబాద్‌లో అతని నివాసాన్ని పోలీసులు తనిఖీ చేయగా, విషయం బయటపడింది.