AP: నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మద్దూరుమెట్ట హైవేపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో 45 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. అతివేగం, ఓవర్ టేక్ చేయడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా, ఇటివల కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయిన విషయం తెలిసిందే.