కరీంనగర్ PMJ జ్యువెలరీ షాపు రాబరీలో మరో ట్విస్ట్ (వీడియో)

3చూసినవారు
TG: కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాపు దోపిడీ కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ దోపిడీలో ఐదుగురు కాదు, ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దోపిడీకి పాల్పడిన ఆరుగురు ధర్మపురిలోని విజయలక్ష్మి ప్రైవేటు లాడ్జిలో మూడు రోజుల పాటు బస చేసినట్లు సమాచారం. సాక్షుల కథనం ప్రకారం, నలుగురు మొదటగా రాగా, ఆ తర్వాత ఒక్కొక్కరు, సాయంత్రానికి మరోకరు లాడ్జికి చేరుకున్నారు. ఈ దోపిడీలో సుభోధి గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోపిడీ అనంతరం దుండగులు ధర్మపురిలో పల్సర్ బైక్ ను వదిలి పారిపోయారు.

సంబంధిత పోస్ట్