పట్టాలెక్కనున్న మరో వందేభారత్ స్లీపర్‌.. ఏపీలో హాల్ట్స్ ఇవే?

8చూసినవారు
పట్టాలెక్కనున్న మరో వందేభారత్ స్లీపర్‌.. ఏపీలో హాల్ట్స్ ఇవే?
ముంబయి-బెంగళూరు మధ్య రెండో వందేభారత్‌ స్లీపర్‌ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. దసరా నాటికి ఈ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. రైల్వే బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. వారానికి ఆరు రోజులు నడిచే ఈ రైలు రాత్రి 10 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు ముంబయి చేరుతుంది. ముంబై నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు బెంగళూరు చేరుతుంది. అనంతపురం, గుంతకల్లు, రాయచూర్‌, కలబురగి, సోలాపూర్‌, పుణె, కల్యాణ్‌ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

సంబంధిత పోస్ట్