ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ, టీవీ, కళా రంగాల్లో నంది అవార్డుల ప్రదానాన్ని పునరుద్ధరించింది. 2011 నుంచి నిలిచిపోయిన ఈ అవార్డులను కళాకారులకు తిరిగి అందించేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు, 2025 అవార్డుల వేడుకను కూడా కలిపి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉత్తర్వులు (G.O.Rt.No.1843) కళాకారుల్లో ఆనందం నింపాయి.