ఉద్యోగులు, పెన్షనర్ల EHS పై ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

25చూసినవారు
ఉద్యోగులు, పెన్షనర్ల EHS పై ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
AP: రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) కింద చెల్లించాల్సిన చందాలను నేరుగా NTR వైద్య సేవా ట్రస్ట్కు జమ చేయాలని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగి/పెన్షనర్ వాటా 50 శాతం, ప్రభుత్వ వాటా 50 శాతంతో కలిపి నిధులను జమ చేయనున్నారు. జీతాలు, పెన్షన్ల చెల్లింపుతో పాటే ఈ నిధుల జమ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ నిర్ణయంతో EHS నిధుల జమ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది.

సంబంధిత పోస్ట్