బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రేపు మధ్యాహ్నానికి పిటిషన్ ఫైల్ చేయాలని, సుప్రీంకోర్టులో వాదించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమించాలని సీఎం ఆదేశించారు. ఢిల్లీలోని న్యాయనిపుణులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వచ్చే వారం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.