శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిందని, పవర్ జనరేషన్ నిలిపివేయాలని నిబంధన ఉన్నా ఏపీ అక్రమంగా నీటిని తరలించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని వాడాలని, తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు రైతులకు నష్టం కలిగించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తే ఊరుకోబోమని, ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం నీటి తరలింపును ఆపివేసిందని తెలిపారు.