AP: తిరుపతి జిల్లా పాకాల బస్టాండ్లో శుక్రవారం ఐదు రూపాయల చిల్లర వివాదం కారణంగా ఓ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ వృద్ధ ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డారు. తనకు రావాల్సిన రూ. 5 చిల్లర ఇవ్వాలని అడిగిన వృద్ధుడిపై కండక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి, దుర్భాషలాడి, భౌతిక దాడి చేశారు. ఈ ఘటన బస్సు కెమెరాల్లో రికార్డయింది. బాధితుడు కండక్టర్పై శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆర్టీసీ యాజమాన్యం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.