జమ్మూకశ్మీర్‌లో ఏపీకి చెందిన సైనికుడి మృతి

24408చూసినవారు
జమ్మూకశ్మీర్‌లో ఏపీకి చెందిన సైనికుడి మృతి
AP: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హవల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాపట్లకు చెందిన సైనికుడు మృతి చెందాడు. కంకటపాలేనికి చెందిన మద్దసాని గోపికృష్ణ (33) బుధవారం రాత్రి సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా.. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. గోపికృష్ణ మృతిపై విచారణ జరుగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు. గురువారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్