
'అఖండ 2' రిలీజ్.. అప్డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ
‘అఖండ 2’ సినిమా విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. తొలుత డిసెంబరు 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు అసహనం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ తమ క్షమాపణలు తెలుపుతూ, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు ధన్యవాదాలు తెలిపింది.




