ఏపీలో టెట్ హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. డిసెంబర్ 10 నుండి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచారు. అక్టోబర్ 24 నుండి నవంబర్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు చేసుకున్నారు. ప్రతిరోజూ రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయి. మాక్ టెస్టులు కూడా అందుబాటులో ఉంచారు. హాల్‌టికెట్లను https://tet2dsc.apcfss.in/ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.