తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు శనివారం గడువు ముగిసింది. చివరి రోజున 30 వేలకు పైగా దరఖాస్తులు రాగా, మొత్తం 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ఎక్కువగా ఏపీ సరిహద్దుల్లోని జిల్లాల్లోని షాపులకు దరఖాస్తు చేసినట్లు సమాచారం.