మళ్లీ ఉద్యోగులను తొలగించిన యాపిల్‌

4822చూసినవారు
మళ్లీ ఉద్యోగులను తొలగించిన యాపిల్‌
టెక్ దిగ్గజం యాపిల్ తన సబ్‌స్క్రిప్షన్ వర్కౌట్ ప్లాట్‌ఫారమ్ 'ఫిట్‌నెస్ ప్లస్'లో ఉద్యోగుల తొలగింపును ప్రారంభించింది. గత వారం జరిగిన ఈ తొలగింపులు ప్రధానంగా ఫిట్‌నెస్ ప్లస్ ఆడియో విభాగంలో పనిచేస్తున్న కొద్దిమంది ఉద్యోగులపై ప్రభావం చూపాయి. ఫిట్‌నెస్ ప్లస్ నిర్వహణకు అవుతున్న భారీ ఖర్చులు, నిరంతరం కొత్త కంటెంట్‌ను అందించాల్సిన అవసరం, సబ్‌స్క్రైబర్లు మధ్యలోనే తప్పుకోవడం వంటి ఒత్తిళ్ల కారణంగానే ఈ తొలగింపులు జరిగాయి. గత ఆగస్టులో యాపిల్ సంస్థ 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్