చైనాకు చెందిన షావోమీకి యాపిల్, శాంసంగ్ కంపెనీలు లీగల్ నోటీసులు జారీ చేశాయి. షావోమీ తన వ్యాపార ప్రకటనల్లో తమ ఉత్పత్తులను పోల్చి చూడడంపై వేర్వేరుగా ఈ నోటీసులు పంపించాయి. ఈ ప్రకటనల వల్ల తమ ప్రీమియం బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఇరు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనల వల్ల భారత్ వంటి దేశాల్లో తమ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని నోటీసుల్లో పేర్కొన్నాయి.