TG: రాష్ట్రంలో కొత్త పింఛన్ల పంపిణీకి రేవంత్ సర్కార్ సిద్దమైంది. ఈ ఆర్థిక సంత్సరంలో 2 లక్షల కొత్త పింఛన్లను అందించాలని నిర్ణయించింది. వృద్దాప్య పింఛన్‌కు 57 ఏళ్లు పైబడిన వారు అర్హులు, దివ్యాంగులకు వైకల్యం 40శాతానికి పైగా ఉండాలి. ఇక వితంతు పింఛన్ కోసం భర్త డెత్ సర్టిఫికేట్, వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. బీడీ కార్మికులు గుర్తింపు పొందిన బీడీ పరిశ్రమలో పని చేస్తూ 18 ఏళ్లు నిండి ఉండాలి. ఎయిడ్స్, డయాలసిస్ పేషెంట్లకు ఎలాంటి వయో పరిమితి లేదు. కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్, మొబైల్ నెంబర్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజు ఫొటో, రేషన్ కార్డు, ఇన్ కమ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ వంటి అవసరమైన డాక్యుమెంట్లతో గ్రామ పంచాయతీ, మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో సబ్మిట్ చేస్తే అధికారులు పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు.