రాష్ట్రీయ బాల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

36చూసినవారు
రాష్ట్రీయ బాల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన బాలలకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌'లను ప్రకటించనుంది. సాహసం, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్ర, సాంకేతికత, పర్యావరణ, కళలు, సాంస్కృతిక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన బాలలకు ఈ పురస్కారాలు అందజేస్తారు. ఐదేళ్లు పైబడి, జులై 31 నాటికి 18 ఏళ్లు నిండని బాలలు జాతీయ అవార్డ్స్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్లు పంపవచ్చు. బాలలు స్వయంగా లేదా ఇతరుల ద్వారా నామినేషన్లు పంపేందుకు జులై 31 వరకు గడువు ఉంది.

సంబంధిత పోస్ట్