
చెత్త దేశానికి అతిపెద్ద ఆర్థిక వనరుగా మారే అవకాశం ఉంది: సీఈఈడబ్ల్యూ నివేదిక
భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త, మురికికూపాలు దేశానికి అతిపెద్ద ఆర్థిక వనరుగా మారే అవకాశం ఉందని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ- ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. పట్టణ ప్రాంతాల నుండి వెలువడే సేంద్రీయ వ్యర్థాలను సరిగ్గా నిర్వహిస్తే 2047 నాటికి 55 బిలియన్ల (సుమారు 5 లక్షల కోట్ల) మార్కెట్ అవకాశం లభిస్తుందని నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రోజుకు 1.71 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు వస్తుండగా, అందులో సగం సేంద్రీయ వ్యర్థాలే ఉన్నాయి.




