ఇరాన్ దాడులతో అరబ్ దేశాలు యుద్ధానికి సిద్ధం: ట్రంప్

0చూసినవారు
ఇరాన్ దాడులతో అరబ్ దేశాలు యుద్ధానికి సిద్ధం: ట్రంప్
అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ లయన్స్ రోర్' తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తోంది. ఇరాన్ దాడులతో షాకైన అరబ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయేల్‌తో కలిసి యుద్ధంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు. ఇరాన్ సైన్యం బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై క్షిపణులతో దాడులు చేసిందని, దీంతో ఆగ్రహించిన ఈ దేశాలు ఇరాన్‌కు బుద్ధి చెప్పాలనుకుంటున్నాయని ట్రంప్ తెలిపారు. సుప్రీం లీడర్ ఖమేనీని హతం చేసిన అనంతరం ఆపరేషన్ లయన్స్ రోర్ విజయవంతమైందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్